నవతెలంగాణ - మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం బొగ్గుతవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవ క్రీడా పోటీల ప్రారంభ వేడుకలు సోమవారం ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందని అన్నారు.
క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడటం కంటే మైదానాల్లో క్రీడలు ఆడటం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఉల్లాసం కలుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ మేనేజర్ సురేష్ బాబు, జీఎం మెకానికల్ విశ్వప్రసాద్, ఫిట్ ఇంజనీర్ కిషన్, సర్వే జిఎం సర్వోత్తమ్, హెచ్ఎర్ డీజీఎం రమేష్ బాబు, కంపెనీ ఉద్యోగులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.







కామెంట్లు (0)