Magazines

అర్హులందరికీ పెన్షన్లు: ఎమ్మెల్యే జారె

6 గంటల క్రితం

Pensions
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

- నియోజకవర్గంలో 4,900 మందికి కొత్తగా పెన్షన్లు

- మండల పరిధిలోనే 1,000 మందికి మంజూరు

- ఈ నెల 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ

- పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

నవతెలంగాణ - అశ్వారావుపేట

అర్హులందరికీ చేయూత పెన్షన్లు అందిస్తామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ అధ్యక్షతన శుక్రవారం చేయూత పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 4,900 మంది లబ్ధిదారులకు అవకాశం కల్పించింది. ఇందులో అశ్వారావుపేట మున్సిపాలిటీ, మండల పరిధిలోనే సుమారు 1,000 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి.


ఈ నెల 19వ తేదీ నుంచి కొత్తగా ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ కానుంది. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో కొత్త పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్, డీఆర్డీఏ పీడీ విద్యాచందన, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, తహసీల్దార్ దాసరి కిశోర్, ఎంపీడీవో వాల్మీకి కిశోర్, ఏఓ శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ జిల్లా నాయకులు జ్యోతి, తుమ్మ రాంబాబు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్