నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని రాంరెడ్డి పల్లి గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ ఆధ్వర్యంలో కళాకారుల బృందం చేత ఎల్ నినో పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా కళాకారులు ఎల్ నినో వల్ల జరిగే దుష్పరిణామాలను,దానిని ఎదుర్కొనుటకు ప్రభుత్వం చూపుతున్న మార్గదర్శకాలను ప్రజలకు పాటల రూపంలో వివరించడం జరిగింది.అదేవిధంగా వర్షాలు కురిసే అవకాశం లేనందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని,గ్రామాలలో నీటిని వృథా కాకుండా చూసుకోవాలని గ్రామస్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,పాలకవర్గం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)