Magazines

పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

1 గంట క్రితం

POCSO Act
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ముధోల్
నియోజకవర్గమైన ముధోల్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీ సరస్వతీ శిశుమందిర్, రభింద్ర పారశాల, గురుకుల పాఠశాలల విద్యార్థులకు మంగళవారం జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్  సీనియర్ సివిల్ జడ్జి రవీందర్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా పోక్సో చట్టం గురించి విద్యార్థినులకు తెలియజేశారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి క్లుప్తంగా వివరించారు. విద్యార్థినిలు పాఠశాలలో గాని బయట ప్రదేశాల్లో గాని ఏలాంటి వేధింపులు ఎదుర్కొన్న వెంటనే తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారాన్ని చేరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సోమేశ్ పటేల్, ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్