కేంద్ర మంత్రి సంజయ్ ని కలిసిన కుటుంబ సభ్యులు, నాయకులు
నవతెలంగాణ - ముధోల్
నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన కన్యబోయి లక్ష్మణ్ కుమారుడు సాయి కుమార్‌ను దుబాయ్ నుంచి స్వదేశానికి రప్పించాలని బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి నేతృత్వంలో బాధిత కుటుంబ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కరీంనగర్ లో మంగళవారం సాయంత్రం కలిసి వినతిపత్రం అందజేశారు.
దుబాయ్‌లో హోటల్ యాజమాన్యం వేధింపుల కారణంగా తన కుమారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో స్పందించి సాయి కుమార్‌ను త్వరగా స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో తరోడ బిజెపియువ నాయకుడు రవికిరణ్ తో పాటు, బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు, ఉన్నారు.






కామెంట్‌లు (0)