నవతెలంగాణ అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ (BRS),బీజేపీ (BJP)లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 50ఏళ్ల క్రితం బీజేపీ గానీ, 25ఏళ్ల క్రితం బీఆర్ఎస్ గానీ లేవని ప్రస్తావిస్తూ,అధికారం కోల్పోతే ఆ పార్టీల మనుగడ కష్టమని విమర్శించారు.అధికారం కోల్పోయినప్పటి నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, "ఫామ్‌హౌస్‌లో ఎత్తిపోతల పథకం"లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
గత 34నెలల కాలంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సుమారు రూ.2.5కోట్ల జీతభత్యాలు తీసుకున్నప్పటికీ,అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని,ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదని ఆరోపించారు.గత పాలనలో చేసిన తప్పులకు ప్రజలకు సమాధానం చెప్పలేకే ఆయన బయటకు రావడం లేదని వ్యాఖ్యానించారు.






కామెంట్లు (0)