Magazines

మూడుచింతల్ పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

2 గంటల క్రితం

birthday
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

- అనాథ పిల్లలకు పండ్లు, పంపిణీ చేసిన మూడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు 

నవతెలంగాణ - శామీర్ పే
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి ఆనందోత్సాహాల మధ్య వేడుకను జరుపుకున్నారు. జగన్ గూడ గ్రామ పరిధిలోని ఓ అనాధాశ్రమంలో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి దూసుకుపోతోందనాన్నరు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ పాపిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పులి ప్రభాకర్, రవీందర్ రెడ్డి, భూపాల్ బండి జగన్నాథం, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,, బసవ రెడ్డి,గురువయ్య, అనంతరెడ్డి, వెంకట్ రెడ్డి, లతా రెడ్డి,ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జైపాల్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, శశిధర్ రెడ్డి, నర్సారెడ్డి,వేణుగోపాలరావు, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, నర్సింలు, రాజు, జైపాల్ రెడ్డి, వెంకటేష్, శిల్పా యాదగిరి, మహేష్, గోపి, వీరేశం గుప్తా, లక్ష్మణ్, తిరిపిగల్ల  శ్రీనాథ్, ఆంజనేయులు, ఆకుల నాగేష్, శ్రీకాంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, బాల నరసింహ, మహమ్మద్ యూసుఫ్, మమ్మ జాఫర్, కేశవాపూర్ నాగేష్, గురువయ్య, బండి రవి, మధు, మహేష్ నారాయణపూర్, నర్సింలు, బాలకృష్ణ, కొమ్ము రాజు, నవీన్, శ్రీశైలం కొల్తూరు వీరేశం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్