Magazines

మిడ్జిల్‌లో ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు..

2 గంటల క్రితం

Birthday
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 08, 2026 | 2 నిమిషాల చదవడం

అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి 

వక్స్ బోర్డ్ పాలమూరు జిల్లా మాజీ చైర్మన్ గౌస్ రబ్బాని 

నవతెలంగాణ-మిడ్జిల్ 

రాజకీయాలకు అతీతంగా పేద వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కృషి అభినందనీయమని వర్క్స్ బోర్డ్ పాలమూరు జిల్లా మాజీ చైర్మన్ గౌస్ రబ్బాని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మిడ్జిల్ మండల కేంద్రంతోపాటు, వాడియాల, వేముల, మసిగుండ్లపల్లి, రాణిపేట్, చిల్వేర్, తదితర గ్రామాలలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి ఒకరికి ఒకరు కాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల్లో గౌస్ రబ్బాని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.


Midjilప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన పేదలందరికీ అందించడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మిడ్జిల్ జెడ్పిటిసి గ గెలుపొంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధితులు చేపట్టడంతో మిడ్జిల్ మండలం అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. 


ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మండల నాయకులు బరిగల వెంకటయ్య, ప్రశాంత్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, గడ్డల విజయ్ కుమార్, సాయిలు, బాలయ్య, సత్యం గౌడ్, జహీర్, నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు వెంకట శివ ప్రసాద్, జాంగిర్, కాంగ్రెస్ ఎస్టి సెల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, ఎస్సీ డిపార్ట్మెంట్ మండల అధ్యక్షులు చెన్నయ్య, వివిధ గ్రామాల సర్పంచులు నాగరాజు గౌడు, శ్రీశైలం యాదవ్, రాజు నాయక్, ధర్మానాయక్, శ్రీను నాయక్, కాంచనపల్లి నరసింహ, శ్రీధర్, బంగారు, కృష్ణ యాదవ్, బసవరాజు, శివకుమార్, అశోక్, ఉస్మాన్, ఆదాం  అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్