అధికారుల నిర్లక్ష్యంతో స్త్రీనిధి లక్ష్యం పక్కదారి
నవతెలంగాణ-అచ్చంపేట
స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం స్త్రీనిధి పథకం ప్రవేశపెట్టింది. జిల్లాలో 8 మండలాలలో స్త్రీనిధి బకాయిలు రూ.11 కోట్లకు పేరుకుపోయింది. అమ్రాబాద్ లో రూ 1.కోటి, 72 లక్షలు, ఉప్పునుంతలలో రూ 1
కోటి 43 లక్షలు, తెలకపల్లిలో రూ.1.కోటి 43 లక్షలు, బిజినపల్లిలో రూ.1 కోటి 23 లక్షలు, తిమ్మాజిపేటలో రూ.1కోటి10.లక్షలు, వెల్దండలో రూ.1 కోటి 21 లక్షలు, బల్మూరులో రూ.1.కోటి 25 లక్షలు, పెంట్లవెల్లిలో రూ.1 కోటి 10లక్షలు మొత్తం రూ. 11కోట్ల బకాయిలు ఉన్నాయి. స్త్రీనిధి అధికారులు బకాయిల విషయాన్ని బహిర్గతం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వడానికి దాపరికం చేస్తున్నారు.
@ స్త్రీనిధి వసూళ్లు బకాయిలలో అవినీతి..?
స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల నుంచి రుణాల వాయిదాల డబ్బులు వసూలు చేసిన (ఆర్పీలు) రిసోర్స్ పర్సన్ లు, వివోఏలు సంబంధించిన బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా వ్యక్తిగతంగా వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల స్త్రీనిధి బకాయిలు వసూలు, బ్యాంకులలో జమ చేసే విధానం పైన పర్యవేక్షణ చేయవలసిన అధికారులు నిర్లక్ష్యం చేయడం ద్వారా బకాయిలు పేరుకుపోయినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
స్త్రీనిధి నెల వాయిదా బకాయిలు వసూలు చేసే సిబ్బంది పైన అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే....! నిధుల అవినీతి బహిర్గతం అయ్యే అవకాశం ఉంటుంది. రికవరీ కి సంబంధించిన అధికారులు కఠినంగా విధివిధానాలు అమలు చేసి , స్త్రీనిధి బకాయలు వసూలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్త్రీనిధి లక్ష్యం పక్కదారి పడుతుందని మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు.






కామెంట్లు (0)