పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్
నవతెలంగాణ -టేకుమట్ల
మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం తండ్రి దాసారపు లింగయ్య (80) మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అంత్యక్రియలో పాల్గొని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ దొంతుల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగంపల్లి కిరణ్ రావు, సర్పంచులు కూర వెంకటరాజి రెడ్డి, వ్యాసనవేణి శ్రీలేఖ సతీష్ రావ్, పచ్చిక దిలీప్ రెడ్డి, సర్పంచ్ ల పోరం మండల అధ్యక్షులు కుర్రె మల్లయ్య యాదవ్, నాంపల్లి వీరేశం, బొడ్డు తిరుపతి, పొన్నం సాంబయ్య, అంబాల కిరణ్ కుమార్, పెరుమండ్ల చంద్రకళ మొగిలి, మండల నాయకులు తోట గట్టయ్య, కత్తి సంపత్, సంగి రవి, ఏనుగు లచ్చిరెడ్డి, మాదం కొమురయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్రమౌళి మాదిగ, మొగిలి, సిపిఐ (ఎం ఎల్) జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్, మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షులు ఎలకటి రాజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)