మృతుని కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది

55 నిమిషాల క్రితం

Congress
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు

నెల్లికుదురు మండల కేంద్రంలో ఇటీవల మరణించిన మేస్త్రి మల్లేష్ కుటుంబానికి మరియు చెన్నబోయిన ఆగమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లు స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం వారి కుటుంబాన్ని సందర్శించి చిత్రపటానికి పూలమాలవేసి ఎర్రగడ్డ సానుభూతి తెలిపారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారు మరణించడం గ్రామానికి తీరని లోటు అని అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మంచాల వెంకన్న , పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నాపురం.యాకయ్య,  వార్డు సభ్యులు బండి యాకయ, యూత్ అధ్యక్షుడు మద్ది రాజేష్,  ఆకుల కొమురెల్లి, హెచ్ రవి, మయ్య, వెంకన్న, మామిడాల సత్యనారాయణ, ఆవుల వెంకన్న, గుండెబోయిన ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్