Magazines

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా రాజ్యాంగం దినోత్సవం

1 గంట క్రితం

Constitution Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

తాడిచెర్ల గ్రామ పరిధిలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మ అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి విద్యార్థులకు వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్‌ రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్దదిగా భారత రాజ్యాంగం రూపొందించబడిందని పేర్కొన్నారు. రాజ్యాంగ  దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్