నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండల పరిధిలోని పెద్దటాక్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జోరందుకున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాలతో లబ్ధిదారులు రిజవానబీ, సందీప్ గైక్వాడ్ల నూతన ఇండ్ల నిర్మాణాలకు శుక్రవారం మార్క్ అవుట్ వేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. వెంటవెంటనే బిల్లులు మంజూరు చేసి, త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేందుకు అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన్ కార్యదర్శి విలాస్ గైక్వాడ్, ఉప సర్పంచ్ జాకీర్ ఖాన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పండరి, వార్డు మెంబర్లు షాదుల సాబ్, జిలానీ సాబ్, తరోటే సూర్యకాంత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదవ్ రావు పటేల్, సాయిలు గోండ, సాదిక్ సాబ్ , అబ్దుల్ సాబ్, యూసుఫ్ సాబ్, ఫకీర్ సాబ్, ఇందిరమ్మ లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)