నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
E1, E2, D విద్యార్థులకు హాస్టల్స్ కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపెల్లి నరేష్ అన్నారు. హాస్టల్స్‌కు కరెంట్, వాటర్ సప్లై ఇవ్వాలని, శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట విద్యార్థులు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుత ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యార్థులను విడుదల చేయాలనీ, ప్రభుత్వం స్పందించి, సీఎం రేవంత్ రెడ్డి ఓయూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కొంపెల్లి నరేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్వీ విద్యార్థులు నాగరాజు, జంగయ్య, సురేష్,హరీష్,కార్తీక్ రెడ్డి, నిరుద్యోగ జాక్ చైర్మన్ బీమ్ రావు విద్యార్థులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)