Magazines

విద్యతోనే వికాసం సర్పంచ్ శాంతవ్వ ఈరన్న

22 గంటల క్రితం

Shantavva Eeranna
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

విద్యతోనే వికాసమని పెద్ద తడగూర్ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు అందించే యూనిఫామ్ దుస్తులను గురువారం పెద్ద తడుగూరు గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తుందని విద్యతోనే వికాసమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్