నవతెలంగాణ-సత్తుపల్లి
జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఐఈవో) కె. రవిబాబు శ్రీ బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. విద్యాబోధన తీరును పరిశీలించారు. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్, ఆర్ట్స్ విద్యార్థులకు వివిధ యాక్టివిటీలపై ఆయన పలు సూచనలు చేశారు.
ఒకేషనల్ విద్యార్థులకు అందుతున్న ఓజేటీ శిక్షణా కార్యక్రమాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో 1970లో నిర్మించిన పాత భవనాలను, తరగతి గదులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల పరిస్థితిపై ఉన్నతాధికారులకు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు నివేదిస్తామని తెలిపారు. తరగతి గదుల వసతి మెరుగుపడేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గుడిపాటి లక్ష్మయ్య, కళాశాల అధ్యాపపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)