దూడల ఆరోగ్య పరిరక్షణకు పశుసంవర్ధక శాఖ చర్యలు
నవతెలంగాణ - ఆలేరు రూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దూడలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పశువైద్యాధికారి డాక్టర్ చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని మొత్తం 65 దూడలకు నట్టల నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
దూడల ఆరోగ్య పరిరక్షణ, ఎదుగుదలలో నట్టల నివారణ కీలకమని, పశుపోషకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం ఇస్తారు, వడ్ల స్వామి, చౌడబోయిన ఉపేందర్, నాగరాజు, ఆంజనేయులు, కనకయ్య, పోతారం దేవయ్య, రాజు, కొలనుపాక పశుగణాంక అధికారి క్రాంతిరేఖ, గోపాలమిత్రులు స్వామి, అశోక్, సుధాకర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)