నవతెలంగాణ-కుభీర్
మండలంలోని గోడపూర్, గోడిసెర, డోడర్నా గ్రామానికి చెందిన వ్యక్తులు ఇటీవల గత కొంత కాలం నుంచి అనరోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు శనివారం బైంసా లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బోస్లే నారాయణ్ రావు పటేల్ మండల నాయకులతో కలసి సీఎంఆర్‌ఎప్ కింద మంజురైనా చెక్కు లను బాదిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నారాయణ్ రావు పటేల్ మాట్లాడుతూ.. ముధోల్ నియోజకవర్గంలో దాదాపుగా 33 మందికి రూ.11లక్షల చెక్కులను అందజేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్ డి సి సి కార్యదర్శి పురం శెట్టి రవికుమార్, బంక బాబు, శివాజీ, సందీప్ ఆయా గ్రామాల సర్పంచులు భోజరం పటేల్, రాథోడ్ సురేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
28 నిమిషాల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)