Magazines

దివ్యాంగ విద్యార్థులను ఆన్లైన్ ప్రసాస్థ్ నమోదు చేయాలి: ఎంఈఓ

1 గంట క్రితం

Divyang students
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

పాఠశాలల్లోని దివ్యాంగ విద్యార్థుల పేర్లను సమగ్రశిక్షా ప్రసాస్థ్ యాప్ లో నమోదు చేయాలని మండల విద్యాశాఖ అధికారి డి.స్వామి పేర్కేన్నారు. గురువారం భీంగల్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఎంఈఓ మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులకు సాధారణ విద్యార్థులతో సమానంగా అన్ని సౌకర్యాలు "అందించడానికి ప్రభుత్యం ప్రసాస్థ్ యాప్ ప్రవేశపెట్టిందన్నారు.


యాప్ లో పేర్కోన్న వైకల్య లక్షణాలు ఉన్న విద్యార్థులను తప్పనిసరిగా యాప్ లో పొందుపరచాలన్నారు. దీని ద్వారా అంగవైకల్యం గల విద్యార్థులకు విద్య, వైద్యం, వారికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలన్ని లభిస్తాయన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు అన్ని తరగతుల్లో దివ్యాంగ విద్యార్థులను గుర్తించాలని కోరారు. అనంతరం స్పెషల్ ఎడ్యుకేటర్ రామకృష్ణ, ఐ.ఈ.ఆర్.పి. జలంధర్ ప్రసస్థ్ యాప్ పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ ఎడ్లశేఖర్, ఉపాధ్యయులు లింబాద్రి, టీ.ఈ.ఆర్పీ కిషన్, తదితర హెచ్ ఎమ్ లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్