నవతెలంగాణ-ఆలేరు టౌన్
దీపావళి పర్వదిన వేడుకలు ఆలేర్ పట్టణంలో ఆదివారం, సోమవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మామిడి తోరణాలు, బంతిపూలతో ఇంటి గుమ్మాలను ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. తీపి వంటకాలు చేసి బంధుమిత్రులకు పంచారు. అదేవిధంగా శ్రీ కేదారేశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం, నోములు ఆచరించారు. అర్చకులు వ్రత కథలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చిన్నారులు వీధివిధిన రోడ్లపై, ఇంటి ఆవరణల్లో ఆనందంగా టపాసులు కాల్చి పండుగను జరుపుకున్నారు. పండగ సందర్భంగా ఆలేరు పట్టణంలో ప్రధాన రహదారుల గుండా ఉన్న క్రాకర్స్ దుకాణాలు జనాలతో కిక్కిరిపోయాయి. బాణాసంచా కిలో రూ.599 చొప్పున
అమ్మినా జనాలు కొనేందుకు వెనకాడలేదు. పిల్లలతోపాటు పెద్దలు జోరుగా బాణాసంచా కాల్చి కుటుంబంతో ఆనందంగా గడిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రజలు బంధుమిత్రులు, యువత,చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)