Magazines

ఇందిరమ్మ ఇండ్లలో ఘనంగా దీపావళి సంబరాలు

25 నిమిషాల క్రితం

Diwali
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్

సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు.. మండల కేంద్రంతో పాటు వాడియాల, మున్నా నూర్, బోయిన్పల్లి, కొత్తూరు, అయ్యవారిపల్లి, చిల్వేర్, బైరంపల్లి, కంచనపల్లి, దోనూర్, సింగం దొడ్డి, ఈదుల బాయ్ తాండ, మసుగుండ్లపల్లి తదితర గ్రామాల్లో నిర్మాణం పూర్తైన ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి పండుగ సంబరాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి పండులో పాలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, బరిగల వెంకటయ్య, సాయిలు, గడ్డల విజయ్ కుమార్,

 సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్ , ఆయా గ్రామాల సర్పంచులు శశికళ లక్ష్మారెడ్డి, సుజాత మల్లికార్జున రెడ్డి, రాములు, సువర్ణ, కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.


సొంతింటి కల నెరవేరుతున్న సందర్భంగా తమ ఇళ్లలో మొదటిసారిగా దీపావళి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిల్వేర్ సర్పంచ్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ..పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటికి వెళితే కాంగ్రెస్ నాయకులకు వారు చూపించే ప్రేమ, ఆప్యాయత మర్యాదల ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి, కాంచనపల్లి నరసింహులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు వెంకట శివప్రసాద్, సత్యం గౌడ్, రాజారెడ్డి, శ్రీకాంత్, చుక్కయ్య, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, జహీర్, ఆయా గ్రామాల ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు , కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్