నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని పెద్దతడుగూరులో నూతన ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి వేడుకలను ఆ గ్రామ సర్పంచ్ శాంతవ్వ-ఈరన్న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతున్నాయని పేర్కొన్నారు. లబ్దిదారులు ఎంతో ఆనందంగా వారి నూతన ఇండ్లలో దీపావళి వేడుకలను జరుపుకుంటున్నారని చెప్పారు. వారి ఆనందానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు, కార్యదర్శి నర్సింలు, పంచాయతీ సిబ్బంది, ఇందిరమ్మ లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)