Magazines

కరువు విలయం

1 గంట క్రితం

Drought relief
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

5 మండలాలను ప్రకటించిన ప్రభుత్వం

నవతెలంగాణ-మల్హర్ రావు

భూపాలపల్లి జిల్లాలో వర్షాలులేక పంటలు ఎండిపోయిన మల్హర్ రావు, కాటారం, మహముత్తారం, మహాదేఅపూర్, గోరికొత్తపల్లి మండలాల్లో మోస్తరు కరువు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఎల్నినోతో వర్షాభావ, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాలు పడిపోవడం, సాగునీటి కొరత, భారీగా పంటలు దెబ్బతినడంతో ప్రభుత్వం మంగళవారం కరువు మండలాలను ప్రకటించింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ కింద సహాయాన్ని మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.


పంట నష్టం, ఇన్పుట్ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం, భూగర్భజలాలు, జలాశయాల పునరుద్ధరణకు మద్దతు అందించాలని కోరింది. వీబీ జీ రామ్ కింద 50 అదనపు రోజుల పని (పూర్తి ఖర్చును కేంద్రం భరించాలి), ఎరువులు,1,500 మెగావాట్ల అదనపు విద్యుత్, రూ.20,000 కోట్ల ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ అందించాలని కోరింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అదనపు సహాయం అందించాలని కూడా కోరింది. తక్షణమే సహాయక చర్యలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది.


కాటారం, మహాదేఅపూర్, మహముత్తరాం, మల్హర్ రావు మండలాలు ఒకప్పుడు వ్యవసా యానికి కీలక ప్రాంతాలుగా ఉండేవి ఉండేది. సాగునీటి వనరులు వ్యవసాయానికి అండగా నిలిచాయి. వరి, పత్తి, మిర్చి వంటి పంటలు రైతులు పెద్ద ఎత్తున సాగు చేసేవారు. మొన్నటి వరకు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. ఎల్ నినోతో ప్రాజెక్టులు, చెరువులు నిండక వర్షాలపై ఆధారపడిన ప్రాంతాల్లో వానలు సకాలంలో కురవకపోవడంతో పంటలకు అవసరమైన నీరు అందకపోవడం రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఈ నేపథ్యంలో కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించడం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టం చేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్