నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని సుల్తాన్ పేట్ అంగన్వాడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని ఆ గ్రామ బిజెపి పార్టీ బూత్ అధ్యక్షులు ఊష్కళ్వార్ రాజు తెలిపారు. అంగన్వాడీలో ఫ్యాను లేకపోవడంతో చిన్నారుల సౌకర్యార్థం తన సొంత నిధులతో ఫ్యాన్ వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడిలో బాత్రూం, తదితర సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు. అనంతరం ఆయనకు అంగన్వాడీ టీచర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ బూత్ అధ్యక్షులు భీమ్రావు, మారుతి, అంగన్వాడీ టీచర్, అంగన్వాడి చిన్నారులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)