Magazines

ఎల్‌నినోపై రైతులకు అవగాహన

21 నిమిషాల క్రితం

El Nino
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు

మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు బుధవారం గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ తెలిపారు. మండల వ్యవసాయ అధికారి  మహేందర్ తో కలిసి ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల వల్ల వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సమస్యలను వివరించారు.


రైతులు పంట మార్పిడి విధానాలను అవలంబించాలని సూచించారు. ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుంటూ, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రామగిరి సుమన్, ఏఈఓ  ప్రతిభ, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ మౌనిక, పిఎసిఎస్ సెక్రటరీ కత్తుల వెంకన్నా, పిఎసిఎస్ డైరెక్టర్స్ మద్దెల సమ్మయ్య, బెల్లి నర్సయ్య, గ్రామ రైతులు, అనుముల రవీందర్, బొమ్మిడీ వినోద్ రెడ్డి,గుర్రాల నరేష్, పోతారాజ్ యాకన్నా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్