- లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య
నవతెలంగాణ - రాయపోల్
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య అన్నారు.దానిలో భాగంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు బుధవారం రాయపోల్ మండలం పలు గ్రామాలలో ఆయన పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు వంటి పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ముత్తాలీబ్,రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు, ఉప సర్పంచ్ హనుమంతు రాజు,కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉషనగల్ల స్వామి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కిష్టారెడ్డి, వార్డు సభ్యులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)