Magazines

మృతుడి కుటుంబానికి స్నేహితులు ఆర్థిక సాయం

5 రోజుల క్రితం

financial assistance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ -టేకుమట్ల 

మండలంలోని వెంకట్రావుపల్లి(బి) గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మరణించిన కసరవేణి కుమార్ దశదినకర్మకు పదవ తరగతి స్నేహితులు హాజరై నివాళులర్పించి ఆ కుటుంబానికి రూ.15వేల ఆర్థిక సాయం అందజేశారు. మాట్లాడుతూ మీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని మనో ధైర్యాన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో స్నేహితులు కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం, ఆరెపల్లి శ్రీనివాస్, డాక్టర్ సదానందం, ఆకుల చేరాలు, నేరెళ్ల కుమార్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్