మున్నూరు కాపు రాజ్యాధికారం పార్టీ ప్రధాన కార్యదర్శి ఏటిగడ్డ శ్రీనివాసులు పటేల్
నవతెలంగాణ-అచ్చంపేట
బీసీ హక్కులకు భంగం కలిగించే జీఓ నెంబర్ 14ను వెంటనే విరమించుకోవాలని మున్నూరు కాపు రాజ్యాధికారం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏటిగడ్డ శ్రీనివాసులు పటేల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ కులాలు తమ సంఘాల ఆధ్వర్యంలో ట్రస్ట్ లు ఏర్పాటు చేసుకొని సొంత నిధులతో పట్టణాలలో, జిల్లాలలో ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకుంటున్నారని తెలిపారు.
వాటిపై పెత్తనం సాగించేందుకు జీవో 14ను తీసుకరావడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీ కులాలకు కేటాయుంచిన భూములపై, ఆత్మగౌరవ భవనాలపై పాలకులు, అధికారుల అజమాయుషి ఉండకూడదని స్పష్టం చేశారు. అలాంటి దురుద్దేశంతో జీవో 14ను తీసుకురావడం దుర్మార్గమన్నారు. మున్నూరు కాపు సంక్షేమం తగినన్ని నిధులు మంజూరు చేయాలనీ, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలనీ, మంత్రి పదవులు ఇచ్చి తమకు ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు.






కామెంట్‌లు (0)