ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలి
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళికృష్ణ
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రాథమిక పాఠశాలలకు మరణ శాసనంగా మారిన జీఓ-25 సవరించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లు, 50మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, ప్రధానోపాధ్యాయులపై యాప్ ల భారాన్ని తొలగించాలని, బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళికృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం నెల్లికుదురులో మండల మహాసభ అధ్యక్షులు రవీందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మురళీకృష్ణ మాట్లాడారు.
విద్యాశాఖలో పర్యవేక్షణ అధికారుల కొరతన తీర్చాలని, అన్ని జిల్లాలకు, మండలాలకు విద్యాధికారుల పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలని, సర్వీసు నిబంధనల సమస్యను పరిష్కరించి ఉన్నత స్థాయి పోస్టుల పదోన్నతులకు మార్గం సుగమం చేయాలని కోరారు. 2009 విద్యా హక్కు చట్టం అమలు కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23 ను సవరించి పార్లమెంటు లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మండల ప్రధానకార్యదర్శి కోట జనార్ధన్,కార్యదర్శులు రాజన్న, యుగంధర్, దర్గయ్య, నాయకులు రవి, అజయ్, యాకయ్య, మధు, రాజశేఖర్ రెడ్డి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)