Magazines

మధ్యాహ్న భోజన కార్మికులకు సరుకులు సరఫరా చేయాలి

13 గంటల క్రితం

midday meal
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

- మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రామకృష్ణ 

- ఎంఈఓ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా 

నవతెలంగాణ-సత్తుపల్లి 

మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వమే నేరుగా నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, వంటగ్యాస్ సరఫరా చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా గౌరవ అధ్యక్షుడు నిమ్మటూరి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


బుధవారం ఎంఈఓ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ...  రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల వల్ల కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మెనూ ఛార్జీలను ప్రతి విద్యార్థికి రూ.30 చొప్పున పెంచాలని కోరారు. 2023 నవంబర్ సమ్మె సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీ మేరకు, ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం తక్షణమే కార్మికులకు రూ.10 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.


అలాగే కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించి, రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలన్నారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్ రహీమున్నీసా, మండల అధ్యక్షురాలు కె.వెంకమ్మ, పొదిలి సావిత్రి, జరీనా, శ్రీలక్ష్మి, శివపార్వతి, సీహెచ్ నరసమ్మ, మాణిక్యం, సీత, సత్యవతి, కోటమ్మ, సీతమ్మ, అనసూయ, కనకదుర్గ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్