Magazines

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి 

1 గంట క్రితం

workers' problems
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య 

నవతెలంగాణ-మర్రిగూడ 

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో రమావత్ రాజు నాయక్ అధ్యక్షతన జరిగిన మండల గ్రామపంచాయతీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, పి ఎఫ్, ఈ ఎస్ ఐ  సౌకర్యం కల్పించాలని, కనీస వేతనము రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో నవంబర్ 15 నుండి 18 వరకు జరిగే అఖిలభారత 36వ రైతు మహాసభలకు మేము సైతం అంటూ జిపి కార్మికులు చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు.


ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాజు నాయక్, నక్క నరసింహ, పెరుమాండ్ల మంజుల, సిఐటియు మండల నాయకులు సల్బోజు రామలింగా చారి, ఊరు పక్క లింగయ్య, మాడుగుల శీను, తిప్పర్తి జయమ్మ, పోతరాజు కృష్ణయ్య, జిల్లా అమృత, ఎడ్ల రేణుక, ఏర్పుల చిన్న మల్లయ్య, సిరసాల లక్ష్మయ్య, ఎడ్ల రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్