Magazines

నాచారంలో దుర్గాభవాని మాతకు మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు

54 నిమిషాల క్రితం

minister sreedharbabu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 2 నిమిషాల చదవడం

_ఉప్పల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది 

– జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి రూ.10 వేల కోట్ల కేటాయింపు

నవతెలంగాణ–నాచారం:

ఉప్పల్ నియోజకవర్గంలోని వి ఎస్ టి కాలనీలో ఎస్ఎస్ఎస్ యువసేన యూత్ మండపం లో ఏర్పాటు చేసిన దుర్గాభవాని అమ్మవారి విగ్రహం వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. గత తొమ్మిది రోజులుగా కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, లోకకల్యాణ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి, వారి మిత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు ప్రాధాన్యమిస్తూ జంట నగరాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన చెరువుల అభివృద్ధితో పాటు ప్రజలకు వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల కోసం పార్కుల ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

ఎంఎంసి పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. భారీ వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ డ్రైనేజీల్లో అడ్డంకులను తొలగించే చర్యలు చేపడుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయడంతో పాటు, అర్హులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కూడా కృషి చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ప్రజలు నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించారు. నగర, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్