Magazines

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పిన మహిళా ఉద్యోగినులు

1 గంట క్రితం

Women employees who showcased Telangana culture and traditions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నాచారం : నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ (టీజీఎంఈయూ–ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ క్విజ్, పాటలు, ఉత్తమ బతుకమ్మ అలంకరణ పోటీలను నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ విజేతలకు బహుమతులు అందజేసి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో మహిళల పాత్రను అభినందించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యవర్గ సభ్యులు అంజని, శ్రీలత, అరుణ, భాగ్య, ప్రేమలత, సుజాతతో పాటు వేణు కుమార్, రాఘవేందర్, సంతోష్, రమేష్, కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలు ఉద్యోగుల మధ్య ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించాయని నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్