హుస్సేన్ నాయక్ సహకారంతో సోలార్ లైట్లు ఏర్పాటు
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల పరిధిలోని పెద్దతండ గ్రామపంచాయతీ మేచరాజుపల్లి గ్రామాల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ సహకారంతో ఎన్టిపిసిసిఎస్ఆర్ నిధుల ద్వారా సోలార్ లైట్ల ఏర్పాటు చేశామని పెద్దతండ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ సుధారాణి సురేష్ నాయక్ తెలిపారు. గురువారం సోలార్ లైట్లు ప్రారంభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన తండాలు, గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ చొరవతో గ్రామాలకు సోలార్ లైట్లు మంజూరయ్యాయని తెలిపారు.
దీంతో తండాల్లో రాత్రి సమయాల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయనీ, ప్రజల భద్రతకు మరింత రక్షణ కల్పించడంలో ఈ సోలార్ లైట్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్‌కు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప బాదావత్తు రమేష్, జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి, బాదావత్ నవీన్, కోటగిరి అశోక్, మురళి యాకేందర్, సంపత్ రావు,గుంశావళి, విజయ్ సంపత్ రావు, బాదావత్ దినేష్, బానోత్ సురేష్ ,పాల్తే లక్ష్మి పాల్త్య రవి తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)