Magazines

ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ జీవిత బీమా: సర్పంచ్‌

42 నిమిషాల క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి పేద కుటుంబానికి ఆసరాగా నిలుస్తుందని పెద్దతడు గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న తెలిపారు. పెద్దతడుగూరు గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు మాట్లాడుతూ.. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాంతవ్వ ఈరన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కొండ గంగాధర్, ఎంపీడీవో పి సాయిలు, ఎంపీ ఓ సత్యనారాయణ రెడ్డి, గ్రామ కార్యదర్శి నర్సింలు, పంచాయతీ వార్డు సభ్యులు సుభాష్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్