ప్రత్యేక అధికారి డాక్టర్ శివరాజ్
నవతెలంగాణ-మిడ్జిల్
అర్హులకే ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోందనీ, పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను అందిస్తోందని వాడియాల గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ శివరాజ్ అన్నారు. మంగళవారం మండలంలోని వాడియాల గ్రామంలో ఇందిరమ్మ లబ్దిదారుల ఇండ్ల స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివరాజ్ మాట్లాడుతూ.. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని తెలిపారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును రూ. 5 లక్షల నగదును విడతల వారీగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేసి ఆర్థికంగా సాయం అందిస్తోందనీ, ఇండ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఇందిరమ్మ కమిటీ సభ్యులు గడ్డల విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అర్హులకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోంని చెప్పారు. ప్రభుత్వ తీసుకొస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి చంద్రయ్య గౌడ్, ఉప సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు,కాంగ్రెస్ పార్టీమండల నాయకులు బొర్ర శివకుమార్. మాదారం బస్వరాజ్ , గ్రామ పెద్దలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)