Magazines

ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

54 నిమిషాల క్రితం

CPIM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

తెలంగాణలోని నల్గొండ లో నవంబర్‌ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపునిచ్చారు. అశ్వారావుపేట నుంచి రైతులు, రైతు సంఘం నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

గురువారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం సుందరయ్య భవన్‌లో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం మున్సిపల్‌ కౌన్సిలర్‌ తగరం నిర్మల అధ్యక్షతన నిర్వహించారు.


ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల హక్కుల పరిరక్షణకు జాతీయ మహాసభలు వేదిక కావాలని పేర్కొన్నారు. అశ్వారావుపేట ప్రాంతంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే మరో నూతన ఆయిల్‌పామ్‌ పరిశ్రమ నిర్మించాలని, పామాయిల్‌ రిఫైనరీ యూనిట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.


అదేవిధంగా కొబ్బరి సాగు, అభివృద్ధికి ప్రోత్సాహం అందించేలా అశ్వారావుపేట ప్రాంతంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంజూరు చేయాలని జాతీయ మహాసభల్లో తీర్మానం చేయాలని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్‌, కార్యదర్శివర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు, మడకం గోవిందు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్