Magazines

అంగన్వాడీ టీచరు ఉషారాణి మృతికి సీఐటీయూ సంతాపం

05 అక్టోబర్, 2026

dead
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి అంగన్వాడీ టీచర్ జక్కుల ఉషారాణి మృతి పట్ల అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ)  సంతాపం వ్యక్తం చేసింది. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, అంగన్వాడీ ఉద్యోగులకు తీరని లోటని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కొలికపోగు  సర్వేశ్వరరావు పేర్కొన్నారు. ఉషారాణి అంగన్వాడీ టీచర్‌గా చిన్నారులకు అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నాగేంద్ర, నాగలక్ష్మి, షకీనా, జ్యోతి, లక్ష్మితో పాటు పలువురు టీచర్లు పాల్గొని నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, రావుల రాజబాబు ఉషారాణి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్