Magazines

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కీలకం

53 నిమిషాల క్రితం

mla jaare
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

- ఢిల్లీలో జాతీయ స్థాయి సెమినార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

- గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై చర్చ

నవతెలంగాణ - అశ్వారావుపేట

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్‌లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం, గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై చర్చించారు.


ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ, విద్యా, వైద్య సేవల మెరుగుదల, రహదారులు, తాగునీరు, రవాణా సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


గిరిజన ప్రాంతాల్లో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచవచ్చని చర్చించారు. పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

గిరిజన యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరిగితే జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.


వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సు అభివృద్ధి, పెట్టుబడులు, సామాజిక సంక్షేమం, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలపై అభిప్రాయాల మార్పిడికి వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్