Magazines

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ..

2 గంటల క్రితం

G Kishan Reddy
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

- కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి రూ. 100 కూల్ ఇండియా సి ఎస్ ఆర్ నిధులు ఇవ్వండి

- కేంద్రానికి మంత్రి తుమ్మల 8 కీలక వినతులు

- సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, పారిశ్రామిక ప్రగతి, గిరిజన ప్రాంతాల రవాణా మెరుగుదడే లక్ష్యంగా తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో అడుగు ముందుకేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన 8 ప్రధాన అంశాలతో కూడిన వినతిపత్రాలను అందజేసి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్‌ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయి పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కోల్‌ ఇండియా సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.


దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి, కోల్‌ ఇండియా ఎండీతో అప్పటికప్పుడే ఫోన్‌లో మాట్లాడారు. అలాగే, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి మహానది బొగ్గు క్షేత్రాల నుంచి నిరంతరాయంగా బొగ్గు కేటాయించాలని, సింగరేణి కాలరీస్‌కు సత్తుపల్లి బ్లాక్-III బొగ్గు గనిని కేటాయించాలని కోరారు. రామగుండం ఫెర్టిలైజర్స్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో సాంకేతిక లోపాలతో తలెత్తుతున్న యూరియా కొరతకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతులు వేగవంతం చేయాలని కోరారు.


సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-కొండపల్లి రైల్వే పనులను వేగవంతం చేయండి

​సత్తుపల్లి–కొవ్వూరు, పెనుబల్లి–కొండపల్లి కొత్త రైల్వే లైన్ల పనులను వేగవంతం చేయాలని, వచ్చే ఏడాది భద్రాచలం గోదావరి పుష్కరాల నాటికి పాండురంగాపురం–మల్కన్‌గిరి లైన్‌ను సారపాక వరకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రమంత్రిని తుమ్మల  కోరారు. ఈ ప్రతిపాదనలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖల మంత్రులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్