Magazines

భూ సమస్యలకు 'శాశ్వత' పరిష్కారమే రీ-సర్వే లక్ష్యం

1 గంట క్రితం

The aim of the re-survey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

- రైతులతో కల్లూరు సబ్‌ కలెక్టర్ అజయ్ యాదవ్

- సదాశివునిపాలెంలో రీ-సర్వే పనుల పరిశీలన

నవతెలంగాణ-సత్తుపల్లి 

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే రీ-సర్వే లక్ష్యమని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ స్పష్టం చేశారు. సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను సబ్‌ కలెక్టర్ అజయ్ యాదవ్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గ్రామంలో భూ రీ-సర్వే గ్రామసభను ఏర్పాటుచేసి రైతులతో మాట్లాడారు. 


​రీ-సర్వే లక్ష్యాలు, దాని ప్రాముఖ్యత, సర్వే నిర్వహించే ప్రక్రియను గ్రామస్థులకు సమగ్రంగా వివరించారు. ​భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఈ ప్రక్రియలో రైతులు, గ్రామస్థులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. రీ-సర్వే పనులను అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సర్వే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భూముల కొలతలు,  సర్వేకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సబ్ కలెక్టర్ కోరారు. ఈ  రీ-సర్వేలో రైతులకు అన్యాయం జరగొద్దని సర్వే అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్వే బృందం సభ్యులు, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్