Magazines

తెల్లగొర్ల శ్రీనుకు సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకుల నివాళులు

51 నిమిషాల క్రితం

Tributes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన తెల్లగొర్ల శ్రీను దశదిన కర్మ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకులు శ్రీను చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) కార్యకర్త తెల్లగొర్ల నాగేంద్ర తండ్రి శ్రీను మృతికి సంతాపం తెలిపారు.


నాగేంద్ర, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు లిక్కి బాలరాజుకు సమీప బంధువు కావడంతో బాలరాజుతో పాటు మరో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కొక్కెరపాటి పుల్లయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యుడు మడిపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల నాయకులు ఇనుగంటి హరిబాబు, కొల్లు చంద్రశేఖర్ తదితరులు పాల్గొని శ్రీను చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కట్రాల తిరుపతిరావు, లిక్కి నాగరాజు, తట్టుకోళ్ల నవీన్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్