Magazines

పైప్ లైన్ లీకై తాగునీరు వృధా 

1 గంట క్రితం

mission bhagiratha water
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

నిజామాబాదు జిల్లాలోని భీంగల్ మండలం జాగీర్యాల హైవే రోడ్డు పక్కన పైప్​లైన్​లీకై మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోతున్నాయి. మూడు రోజులుగా పైప్​లైన్​ లీకై తాగునీరు రోడ్లపై పారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీటిఎద్దడి నెలకొన్న విషయం తెలిసినా అధికారులు నిర్లక్ష‍్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఓ వైపు నీరు వృధా చేయొద్దని, పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా.. గత మూడు రోజులుగా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి సమస్య పరిష్కరించి, నీటివృధాను అరికట్టాలని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్