Magazines

కొండూరు గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 

2 గంటల క్రితం

Bathukamma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

మండలంలోని కొండూరు గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి అందంగా అలంకరించుకొని తీసుకువచ్చి చుట్టూరా చేరి బతుకమ్మ పాటలతో ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపారు. గ్రామ ప్రజలు ఒక్కచోట చేరి సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు .ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతి, యువకులు, పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్