నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన గుండెపూరి లక్ష్మి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఈ ఎల్ వి ఫౌండేషన్ మర్రిగూడ మండల ఇన్చార్జ్ అయితగోని నరసింహ గౌడ్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
గతంలో కూడా ఈ ఎల్ వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లెంకలపల్లి గ్రామంలో జరిగిన జిల్లాస్థాయి టోర్నమెంట్లో సెకండ్ ప్రైజ్ రూ.25 వేలు గెలుచుకున్న లెంకలపల్లి టీం సభ్యులు చికిత్స నిమిత్తం గుండెపూరి లక్ష్మికి రూ.25 వేలను అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఎల్ వి టీమ్ సభ్యులు మానుపాటి సతీష్, పాక కిరణ్, చాపల శ్రీకాంత్, కొలుగూరి వెంకటేష్, అయితగొని భిక్షం, అయితగొని రాజు, ఏర్పుల హరీష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)