Magazines

విద్యుద్ఘాతానికి ఇల్లు దగ్దం..

08 అక్టోబర్, 2026

House burned
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

- రూ.70 వేల వరకు ఆస్తి నష్టం

నవతెలంగాణ - రాయపోల్‌
రాయపోల్‌ మండలం రామారం గ్రామంలో ప్రమాదవశాత్తూ విద్యుద్ఘాతంతో ఓ ఇల్లు దగ్ధమైన ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాంపల్లి బాగయ్య ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదంలో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, బట్టలు, మంచాలు, ఇతర గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రూ.70 వేల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత కుటుంబం తెలిపింది. ప్రమాదంతో ఇంట్లోని సామగ్రి మొత్తం దగ్ధం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్