Magazines

ఉదారతను చాటుకున్న లెంకలపల్లి సర్పంచ్ 

3 గంటల క్రితం

generosity
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల మారయ్య,గుండెపూరి లక్ష్మి సోమవారం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఖర్చుల నిమిత్తం చెరో రూ.10 వేల (20 వేల)ను ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేతరి శంకర్, వార్డు నెంబర్ గుండెపూరి శ్రీను, మాజీ ఎంపీటీసీ ఏర్పుల అంజయ్య, ఏర్పుల మల్లయ్య, ఏర్పుల డబ్బ నరసింహ, దామెర నరసింహ, ఏర్పుల లింగయ్య, ఏర్పుల వెంకటేశ్వర్లు, ఏర్పుల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్