Magazines

సంగారెడ్డిలో విషాదం..సరాకా పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరి మృతి

1 గంట క్రితం

gas leakeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ‘సరాకా’ పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సుదర్శన్, బాలాజీగా గుర్తించారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఊపిరాడకపోవడంతోనే వారు మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ దుర్ఘటనతో పారిశ్రామికవాడలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్