Magazines

బహుజన పోరాట వీరుడు పండుగ సాయన్న 

1 గంట క్రితం

Panduga Sayanna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

దొరల తాన తెచ్చిండు.. పేదలకు పంచిండు 

ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకులు ఎడ్ల శంకర్ ముదిరాజ్ 

నవతెలంగాణ-మిడ్జిల్ 

దొరల సంపదను దోచి పేదలకు పంచిన చరిత్ర పండుగ సాయన్నకే దక్కిందని ముదిరాజ్ రాష్ట్ర నాయకులు, మిడ్జిల్ సర్పంచుల సంఘం మండలాధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు పల్లె తిరుపతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువత పండుగ సాయన్నను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, పేదల సంక్షేమం కోసం పోరాడిన పండుగ సాయన్న జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.


నాటి నిజాం పాలనలో దొరలు, భూస్వాముల దోపిడీని ఎదిరించి, పేదలకు అండగా నిలిచారని వర్ణించారు. ప్రభుత్వం సాయన్న ముదిరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని, ఆయన చరిత్రను, పోరాట పటిమను గ్రామగ్రామానా ప్రచారం చేస్తూ యువతకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, రాజేశ్వర్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు బరిగెల బాలయ్య, దేవయ్య, బైరంపల్లి సర్పంచ్ గోపాల్, మాజీ సర్పంచ్ నరసింహులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు మహమ్మద్ జహీర్, దళిత నాయకులు రాములు,  ముదిరాజ్ సంఘం మండల నాయకులు కొత్తపల్లి రాజు, మల్లేష్ ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, పర్వతాలు ,నరేందర్, ప్రశాంత్ , యువకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్