Magazines

మిడ్జిల్ మండల కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం


మహిళలకు చీరలు పంపిణీ చేసిన సామాజిక సేవకురాలు జరుపుల రోజా భాస్కర్ నాయక్

నవతెలంగాణ మిడ్జిల్

తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి.ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ సామాజిక సేవకురాలు,సామాజిక సేవా నాయకురాలు జరుపుల రోజా భాస్కర్ నాయక్ పాల్గొని స్థానిక మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రోజా భాస్కర్ నాయక్ మాట్లాడుతూ,మహిళలందరూ ఒకే ఒకే రంగు చీరలు ధరించి బతుకమ్మ ఆడుతుంటే ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.మండల కేంద్రంలో స్థానిక మహిళలతో కలిసి జరుపుల రోజా గ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.చప్పట్లతో,సాంప్రదాయ బతుకమ్మ పాటలతో వేడుకల్లో సందడి చేశారు.పండుగ పూట మహిళల ఆనందంలో భాగస్వామి కావడం,అన్ని వర్గాల ప్రజల కుటుంబాల ఆడపడుచులకు అండగా నిలవడం పట్ల స్థానికులు ఆమె సేవా నిబద్ధతను అభినందించారు.అనంతరం రోజా భాస్కర్ నాయకుడు మహిళలు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు,ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబురాలలో పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్